22 posts in tribal gurukulas School

గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కింద ఉన్న గురుకులానికి కొత్తగా 22 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిజామాబాద్‌ జిల్లా మానాలలో బాలికల గురుకుల విద్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. దీనికి 22 బోధన, బోధనేతర పోస్టుల కోసం ఆ శాఖ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆ పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ నిన్న(శుక్రవారం) ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, కుక్‌, కిచెన్‌ హెల్పర్‌, మల్టీపర్పస్‌ వర్కర్లను ఔట్‌సోర్సింగ్‌లో తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

Comments