ఇక...హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ లైవ్‌ !.. ప్రత్యక్షంగా చూసేందుకు పోలీస్ యాప్


హైదరాబాద్ నగరం ఎంతో మందికి భవిష్యత్తునిచ్చే స్వర్గధామం అదే సమయంలో అక్కడి ట్రాఫిక్ నరకం. బయటకు అడుగుపెడితే ఎక్కడ ఇరుక్కుపోతామో ఎవరికీ తెలియదు. అందుకే ఆ ట్రాఫిక్‌ను చూసుకుని పౌరులు వారి గమనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు ‘ట్రాఫిక్‌ లైవ్‌’ పేరుతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. 

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే నగర ట్రాఫిక్‌ పరిస్థితి క్షణాలమీద మన సెల్‌ఫోన్‌ తెరలపై ప్రత్యక్షమవుతుంది. ఫలితంగా మనం వెళ్లాలనుకున్న దారిలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటే మరో దారిని మనం ఆశ్రయించి సకాలంలో గమ్యం చేరొచ్చు. ఈ యాప్‌లో ఒక్క ట్రాఫిక్‌ మాత్రమే కాదు ఎన్నో ఆప్షన్లు ఇమిడి ఉన్నాయి. ఈ యాప్‌ ప్రస్తుతం ట్రయల్‌రన్‌లో ఉంది. 

దీనిని పూర్తిస్థాయిలో డెవలప్‌ చేశాక నగర ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని అంబులెన్స్‌లో తరలించేటప్పుడు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

Comments