TS Flag flutters on Himalayas


సాహస యువకుల వినూత్న వేడుకసమున్నత శిఖరాలపై తెలంగాణ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావ తొలి వేడుకలను వినూత్నంగా జరుపుకోవాలనే ఉత్సాహంతో.. కొంతమంది తెలంగాణ యువకులు సాహసమే చేశారు. అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ఆధ్వర్యంలో ఏడుగురు పర్వతారోహకులు జూన్‌ 2న ఉదయం హిమాలయాలను అధిగమించారు. సముద్రమట్టానికి 21 వేల అడుగుల ఎత్తులో ఉన్న స్టాక్‌ కాంగ్రి పర్వతానికి అతికష్టం మీద చేరుకొన్నారు. వెంట తీసుకెళ్లిన తెలంగాణ మ్యాప్‌ ఉన్న జెండాను అక్కడ ఎగురవేశారు. బతుకమ్మ ఆడి వేడుకలు జరుపుకున్నారు. కష్టమైనా, వాతావరణం సహకరించకపోయినా.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవాలనే తలంపుతో హిమాలయాలను అధిరోహించామని వారు తెలిపారు.

Comments