Governor can control over administration and policing in Hyderabad : Cash-for-Vote


ఓటుకు నోటూ వ్య‌వ‌హ‌రం క్ర‌మంగా గ‌వ‌ర్న‌ర్ మీద‌కు మ‌ల్లుతోంది. ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వం నేరుగానే విమ‌ర్శ‌లు చేస్తోంది. ఏకంగా మంత్రులే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ను టార్గెట్ చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు, గ‌వ‌ర్న‌ర్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ఏపీ నేత‌లు.. మ‌రో కొత్త వివాదానికి తెర‌లేపారు. ఏపీ స‌ర్కార్ తీరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న తెలంగాణ నేత‌లు.. గ‌వ‌ర్న‌ర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని ఏపి మంత్రుల‌పై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. 

క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌మంటే పాముకు కోపమ‌న్న‌ట్టు త‌యారైంది గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప‌రిస్థితి..తెలంగాణ ప్ర‌భుత్వంపై ప‌దేప‌దే పిర్యాదులు చేస్తున్న ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ పెద్ద‌లు.. చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని గ‌గ్గోలు పేడుతున్నారు..తాజాగా ఓటుకు నోటు వ్య‌వహారంలోనూ గ‌వ‌ర్న‌రే టార్గెట్ అయ్యారు. ఏకంగా మంత్రులే విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వివాద‌ల‌కు తావిస్తోంది. ఏపీ సీఎం, మంత్రులు, నేరుగా ఢిల్లీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. మోన్నీ మ‌ధ్యే గ‌వ‌ర్న‌ర్ ను కూడా క‌లిసిన ఏపీ మంత్రుల బృందం హైద‌రాబాద్ లో సెక్ష‌న్-8 అమ‌లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇదంతా చూస్తుంటే గ‌వ‌ర్న‌ర్ మీద ఏపి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ ఒత్తిడి పెరుగుతోంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్ర వ్య‌క్త‌మ‌వుతోంది. 

గ‌వ‌ర్న‌ర్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, మంత్రులు టార్గెట్ చేయ‌డంతో.. టీఆర్ఎస్ నేత‌లు ఆయ‌న‌కు బాస‌ట‌నగా నిలిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ నే టార్గెట్ చేస్తారా అంటూ నిల‌దీస్తున్నారు. విమ‌ర్శ‌లు చేసిన మంత్రులు ప్ర‌త్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ స‌హా మిగ‌తా వారంద‌రనీ బ‌ర్త‌ర‌ఫ్ చెయ్యాల‌ని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ వ్య‌వ‌హారంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర‌ను స‌పోర్టు చేస్తున్న టీఆర్ఎస్… సెక్ష‌న్-8 అమ‌లు, ఏపీ నేత‌ల ఆరోప‌ణ‌లను కొట్టిపారేస్తోంది.ఓటుకు నోటూ వ్య‌వ‌హ‌ర‌న్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికే చంద్ర‌బాబు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తూ..త‌న సోంత వ్య‌వ‌హ‌రాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు రుద్దుతున్నార‌ని మండిప‌డుతున్నారు.  

ఉమ్మ‌డి రాష్ట్రంలోనే అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కోన్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ నేత‌ల‌కు టార్గెట్ అయ్యారు. ప‌క్ష‌పాత‌మ‌ని ఒక‌రంటే… ప‌క్క‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మరొక‌రు స‌మ‌ర్థిస్తున్నారు. ప్ర‌తీ అంశానికి గ‌వ‌ర్న‌ర్ నే కేంద్ర బిందువును చెయ్య‌డం, రాజ‌కీయ రంగు పులమ‌డం రాజ్యాంగానికి మంచిది కాదంటున్నారు విశ్లేష‌కులు.

Comments