Did You Know: Which island is most dangerous in the world and Why | The Snake Island


పాములను దేవతగా పూజించినప్పటికీ
వాటిని చూస్తే గజగజ వణికిపోతాం. మరి ఒక
చదరపు మీటర్‌కే రెండు మూడు పాములు
కనిపిస్తే..ఓ దీవి మొత్తం పాములతోనే నిండి
ఉంటే.. అవి కూడా ప్రపంచంలోనే అత్యంత
విషపూరితమైన పాములైతే.. ఊహించుకుంటేనే
ఒళ్లు జలదరిస్తుంది. ఆ దీవిలో ఒకటి కాదు,
రెండు కాదు ఏకంగా 4,000 విష సర్పాలు
న్నాయి. ఆ దీవినే ‘స్నేక్‌ ఐలాండ్‌’గా పిలు
స్తారు. ఇంతకీ ఆ స్నేక్‌ ఐలాండ్‌ ఎక్కడుంది?
ఆ దీవి విశేషాలు మీ కోసం...
బ్రెజిల్‌లోని సావో పౌలో తీరంలో ఉన్న ‘ఇల్హా డె క్వైమడ గ్రాండే’ అనే దీవిలో సుమారు 4,000 పాములున్నాయి. 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో ఒక చదరపు మీటర్‌కు ఒక పాము కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దీవి ఇదే.
్ఙ ప్రపంచంలో అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన ‘బోత్రోప్స్‌ ఇన్సులరిస్‌’ ఈ దీవిలో మాత్రమే కనిపిస్తాయి. వీటినే గోల్డెన్‌ లాన్స్‌హెడ్‌ పాములని కూడా అంటారు. ఈ పాము విషం, మిగతా పాముల విషం కన్నా ఐదు రెట్లు ప్రభావ వంతమైనది. గోల్డెన్‌ లాన్స్‌హెడ్‌ విషం ఎంత ప్రమాదకరమైందంటే... ఇది మనిషిపై విషం చిమ్మితే మనిషి శరీరం కూడా కరిగిపోతుంది. బ్రెజిల్‌లో దాదాపు 90 శాతం మంది ఈ పాము కాటుతోనే చనిపోతున్నారు.
గోల్డెన్‌ లాన్స్‌హెడ్‌ పాములే ఈ దీవిలో 2000కి పైగా ఉన్నాయి. ఇవి పక్షులను, ఇతర పాముల్ని తింటాయి.
ఈ దీవిలోని విష సర్పాల గురించి తెలియనప్పుడు మనుషులు వెళ్లినప్పటికీ, ప్రస్తుతం మాత్రం శాస్త్రవేత్తలు, బ్రెజీలియన్‌ నేవీ సిబ్బంది తప్ప ఇంకెవరు ఇక్కడకు వెళ్లట్లేదు.
్ఙ స్నేక్‌ ఐలాండ్‌కు ఎవరూ వెళ్లకూడదంటూ బ్రెజిల్‌ ప్రభుత్వం నిషేధాన్ని కూడా విధించింది. కానీ వేటగాళ్లు ప్రాణాలకు తెగించి లాన్స్‌హెడ్‌ను పట్టుకునేందుకు వెళుతున్నారు. ఎందుకంటే బ్లాక్‌ మార్కెట్‌లో వాటి విలువ చాలా ఎక్కువ . ఒక్క లాన్స్‌హెడ్‌ పాము విలువ అక్షరాల 18 లక్షల రూపాయలు.
11,000 వేల సంవత్సరాల క్రితం సముద్రం మట్టం పెరిగి బ్రెజిల్‌ నుంచి ఈ దీవి వేరుపడింది.
ఈ దీవిలో క్షీరదాలు అసలు కనిపించవు.
ఈ దీవిలో లైట్‌హౌస్‌ కూడా ఉంది. దీన్ని 1909లో నిర్మించారు.
మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 2,900 జాతుల పాములున్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు.
్ఙ పాములకు సంబంధించిన శాస్ర్తాన్ని ‘సర్పెంటాలజీ’ లేదా ‘ఒఫియాలజీ’ అంటారు
అంటార్కిటికా ఖండంలో, ఐర్లాండ్‌ దేశంలో మాత్రమే పాములు లేవు.
్ఙ పాములన్నీ కూడా మాంసాహారులే.
్ఙ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఐతే 2 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు.
సంవత్సరానికి సుమారు 50,000 మంది పాము కాటు వల్ల మరణిస్తున్నారు.
అతి పొడవైన పాము - అనకొండ(18 అడుగులు), అతి చిన్న పాము- త్రెడ్‌ పాము(11 సెంటీమీటర్లు)
అత్యధిక వేగంతో పాకే పాము - బ్లాక్‌ మాంబా ( గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ). ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కూడా ఇదే.

Comments